ఆదిలోనే పంత్ రికార్డును చెరిపేసిన ఆసీస్ టెస్టు వికెట్ కీపర్ అలెక్స్ కేరీ
- ఆసీస్ టెస్టు జట్టులో అనూహ్యంగా చోటు సంపాదించుకున్న అలెక్స్ కేరీ
- అరంగేట్ర మ్యాచ్‌లోనే 8 క్యాచ్‌లతో రికార్డు
- అత్యధిక క్యాచ్‌లు అందుకున్న కీపర్‌గా డికాక్
ఆస్ట్రేలియా టెస్టు వికెట్ కీపర్ అలెక్స్ కేరీ ఆదిలోనే అదరగొట్టాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ రికార్డును బద్దలుగొట్టాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో బ్రిస్బేన్‌లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆసీస్ టెస్టు జట్టులో అనూహ్యంగా చోటు దక్కించుకున్నకేరీ.. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 8 క్యాచ్‌లు అందుకున్నాడు. ఫలితంగా అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు రిషభ్ పంత్ పేరిట ఉంది. అతడు ఏడు క్యాచ్‌లు అందుకుని రికార్డు సృష్టించగా, ఇప్పుడు కేరీ దానిని బద్దలుగొట్టాడు.
అలాగే, ఏడు క్యాచ్‌లు అందుకున్న ఇతర ఆటగాళ్లలో ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్ రీడ్, ఆసీస్ కీపర్ బ్రియాన్ టేబర్, శ్రీలంకకు చెందిన చమర దుసింగె, ఆస్ట్రేలియా కీపర్ పీటర్ నెవిల్, ఇంగ్లండ్‌కు చెందిన అలన్‌నాట్ ఉన్నారు. కాగా, అత్యధిక క్యాచ్‌లు అందుకున్న రికార్డు దక్షిణాఫ్రికా కీపర్ క్వింటన్ డికాక్ పేరిట ఉంది. శ్రీలంకతో జరిగిన టెస్టులో డికాక్ మొత్తం 9 క్యాచ్‌లు అందుకున్నాడు. అయితే, అది అతడికి అరంగేట్ర మ్యాచ్ కాదు.