గుంటూరు జిల్లాలో దారిదోపిడీ దొంగను పట్టించిన ఇన్ స్టాగ్రామ్ పోస్టు
- పెదకాకాని మండలంలో ఘటన
- తక్కెళ్లపాడు వద్ద సతీశ్ అనే వ్యక్తి నుంచి రూ.4 వేలు దోపిడీ
- ఇన్ స్టాగ్రామ్ పోస్టులో దొంగను గుర్తించిన సతీశ్
- పోలీసులకు ఫిర్యాదు
గుంటూరు జిల్లాలో ఆసక్తికర సంఘటన జరిగింది. ప్రముఖ సోషల్ మీడియా సైట్ ఇన్ స్టాగ్రామ్ లో చేసిన ఓ పోస్టు దారిదోపిడీ దొంగను పట్టించింది. గత నెల 18వ తేదీ రాత్రి జిల్లాలోని పెదకాకాని మండలం తక్కెళ్లపాడు వద్ద దారిదోపిడీ ఘటన జరిగింది. బైకుపై వెళుతున్న సతీశ్ అనే వ్యక్తిని బెదిరించిన దొంగలు రూ.4 వేల నగదు లాక్కున్నారు.
అయితే, ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్టు చూసిన సతీశ్... దోపిడీ దొంగల్లో ఒకరు ఆ పోస్టులో ఉండడాన్ని గుర్తించాడు. వెంటనే దీనిపై పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు యర్రంశెట్టి శివను గుర్తించి, అతడిని అరెస్ట్ చేశారు.