ఆ విషయం చెప్పొద్దని రాజమౌళిని గట్టిగా గిల్లిన ఎన్టీఆర్.. వీడియో ఇదిగో
- షూటింగ్‌లో చెర్రీ, తారక్ ల చిలిపి గొడవ గురించి చెప్పిన రాజమౌళి
- ఎన్టీఆర్‌ని చెర్రీ గిల్లాడని చెప్పిన దర్శకుడు
- గిల్లలేదంటూ చరణ్ చెప్పాడని వివరణ
దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదలకు సిద్ధమవుతుండడంతో ఆ మూవీ టీం ప్రమోషన్స్‌లో పాల్గొంటోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముంబైలో మీడియా సమావేశం నిర్వహించిన ఈ సినిమా బృందం ఈ రోజు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతోన్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఆయనను గట్టిగా గిల్లాడు. దీంతో రాజమౌళి ఎగిరిపడ్డారు. వెంటనే నవ్వుతూ ఆయన పక్క నుంచి లేచి నిలబడి మాట్లాడారు.
'ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను. ఈ సినిమా షూటింగ్ దాదాపు 300 రోజులు జరిగింది. అయితే, వీరిద్దరి మూలంగా అందులో దాదాపు 25 రోజులు వృథా అయిపోయాయి. ఇద్దరికీ 30 ఏళ్లకు పైగా వయసు వచ్చింది. ఇద్దరికీ పెళ్లిళ్లు జరిగాయి. చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అన్నా మీ కోసం చచ్చిపోతాం అనే ఫ్యాన్స్ కూడా వున్నారు.
అయితే, సెట్లో మాత్రం ఇద్దరూ గొడవ పడేవారు. అప్పుడు ఎన్టీఆర్ నా దగ్గరకు వచ్చేవాడు. 'జక్కన్నా, చరణ్ నన్ను గిల్లాడు' అనేవాడు. వెంటనే చరణ్ 'నేనా.. ఎప్పుడు గిల్లాను?' అంటూ ప్రశ్నించేవాడు. నేను స్క్రిప్ట్ లోని లైన్లు చదువుకుంటున్నానని చెప్పేవాడు. ఇలా సెట్లో సరదాగా గొడవ పడేవారు" అని రాజమౌళి చెప్పారు. ఈ సమయంలో చెర్రీ కూడా ఆ విషయాలు చెప్పకూడదని రాజమౌళిని వేడుకున్నాడు. అయినప్పటికీ రాజమౌళి అవన్నీ చెప్పేశారు.