సికింద్రాబాద్, కాచిగూడ, నాందేడ్, తిరుపతి నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
- ఈ నెల 18 నుంచి అందుబాటులోకి
- రద్దీని తట్టుకునేందుకేనన్న దక్షిణ మధ్య రైల్వే
- ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని సూచన
రద్దీ నేపథ్యంలో ఈ నెల 18 నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 18న సికింద్రాబాద్-కొల్లాం, 19న కొల్లాం-సికింద్రాబాద్, 22న కాచిగూడ-కొల్లాం, 23న కొల్లాం-కాచిగూడ, నాందేడ్-కొల్లాం, 25న కొల్లాం-తిరుపతి, 26న తిరుపతి-నాందేడ్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు అధికారులు తెలిపారు.
శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్‌వో సీహెచ్ రాకేశ్ కోరారు.
శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్‌వో సీహెచ్ రాకేశ్ కోరారు.