రైళ్లలో ఇక స్వాగతం పలకనున్న ‘ట్రైన్ హోస్టెస్’లు!

  • త్వరలోనే ‘ట్రైన్ హోస్టెస్’ల నియామకాలు
  • ప్రీమియం రైళ్లకు మాత్రమే పరిమితం
  • ట్రైన్ హోస్టెస్‌లలో పురుషులు కూడా..
దేశంలో నడుస్తున్న ప్రీమియం రైళ్లలోని ప్రయాణికులకు ఇకపై ‘ట్రైన్ హోస్టెస్’ల అతిథి మర్యాదలు లభించనున్నాయి. విమానంలో ప్రయాణికులకు స్వాగతం పలికి, మర్యాదలు చేసే ‘ఎయిర్ హోస్టెస్‌’లలానే రైళ్లలోనూ ‘ట్రైన్ హోస్టెస్’లను నియమించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రయాణికులకు స్వాగతం పలకడం, ఫిర్యాదుల స్వీకరణ, ఆహారం అందించడం వంటి విధులు వీరు నిర్వర్తిస్తారు.

ట్రైన్ హోస్టెస్‌లలో మహిళలు, పురుషులు కూడా ఉంటారని అధికారులు తెలిపారు. త్వరలోనే వీరి నియామకాల ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో నడుస్తున్న 12 శతాబ్ది, 2 వందే భారత్, ఒక గతిమాన్, ఒక తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో కలిపి మొత్తం 25 ప్రీమియం రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లలోనే ‘ట్రైన్ హోస్టెస్’లను నియమిస్తారు.


More Telugu News