ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోని కేసీఆర్

  • ముగిసిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు
  • 90 శాతానికి పైగా పోలింగ్ నమోదు
  • మెదక్ జిల్లా నుంచి ఎక్స్ అఫీషియో ఓటరుగా ఉన్న కేసీఆర్
తెలంగాణలో 6 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. మొత్తమ్మీద దాదాపు 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. సిద్ధిపేట, నారాయణఖేడ్, జహీరాబాద్, తూప్రాన్ పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం పోలింగ్ నమోదైంది. మెదక్ జిల్లా నుంచి ఎక్స్ అఫీషియో ఓటరుగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. మొత్తం 12 స్థానాలకు గాను ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా... ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.


More Telugu News