తెలంగాణలో ముగిసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

  • 6 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నేడు పోలింగ్
  • 5 జిల్లాల పరిధిలో ఎన్నికలు
  • ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్
  • ఈ నెల 14న ఓట్ల లెక్కింపు
రాష్ట్రంలోని 6 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. కాగా నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటలకు సమాప్తమైంది. కరీంనగర్ జిల్లాలో 2, ఆదిలాబాద్ జిల్లాలో 1, నల్గొండ జిల్లాలో 1, ఖమ్మం జిల్లాలో 1, మెదక్ జిల్లాలో 1 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నేడు పోలింగ్ నిర్వహించారు.

5 జిల్లాల పరిధిలో ఈ పోలింగ్ నిర్వహించారు. అత్యధికంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 99.69 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. కరీంనగర్ జిల్లాలో 1,324 ఓట్లు ఉండగా, నాలుగు ఓట్లు తప్ప మిగతావి అన్నీ పోలయ్యాయి.


More Telugu News