కేంద్ర బడ్జెట్లో పవర్ లూమ్ క్లష్టర్లను మంజూరు చేయాలి: కేటీఆర్

  • చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చేస్తోంది
  • కేంద్రం కూడా తన వంతు సహకారాన్ని అందించాలి
  • లేకపోతే కేంద్రంపై పోరాటం చేస్తాం
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. సిరిసిల్ల, దుబ్బాక, నారాయణపేట, గద్వాల్, పోచంపల్లిలో పవర్ లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. క్లస్టర్లు ఏర్పడితేనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కేంద్ర ఆర్థికశాఖ, కేంద్ర జౌళిశాఖ మంత్రులకు ఎన్ని వినతిపత్రాలను ఇచ్చినా ప్రయోజనం లేకపోయిందని మండిపడ్డారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సిరిసిల్లలో కేటీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాబోయే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి పవర్ లూమ్ క్లస్టర్లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ ని ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ అంశాలపై పార్లమెంటులోను, పార్లమెంటు వెలుపల పోరాడతామని చెప్పారు. చేనేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చేస్తోందని... కేంద్రం కూడా తన వంతు సహకారాన్ని అందించాలని కోరారు. రాష్ట్ర సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ముందుకు రాకపోతే... బీజేపీ నేతలు తమతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని అన్నారు.


More Telugu News