వినోద్ కాంబ్లీకి కుచ్చుటోపీ పెట్టిన సైబర్ నేరగాళ్లు!

  • కేవైసీ వివరాలు అప్ డేట్ చేయాలంటూ కాంబ్లీకి కేటుగాడి ఫోన్
  • వివరాలు ఇచ్చిన వెంటనే అకౌంట్ నుంచి రూ. 1.13 లక్షల మాయం
  • బాంద్రా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కాంబ్లీ
సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. వీరి దెబ్బకు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా బాధితులుగా మారుతున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, సచిన్ టెండూల్కర్ బాల్య మిత్రుడు వినోద్ కాంబ్లీ కూడా వీరి బారిన పడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే ఈ నెల 3వ తేదీన కేవైసీ (నో యువర్ కస్టమర్) పేరుతో ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. తాను బ్యాంకు ఎగ్జిక్యూటివ్ నని కేవైసీని అప్ డేట్ చేసుకోవాలని కోరాడు. అయితే అతని వివరాలను సరిగ్గా కనుక్కోకుండానే... అతను పంపిన లింకులను క్లిక్ చేసి కాంబ్లీ వివరాలను పంపించాడు.

ఆ వెంటనే కాంబ్లీ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 1.13 లక్షలు మాయమయ్యాయి. ఈ ఘటనలపై ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్ లో కాంబ్లీ ఫిర్యాదు చేశాడు. సదరు వ్యక్తి నుంచి వరుసగా ఫోన్లు రావడం వల్లే వివరాలను ఇచ్చానని చెప్పాడు. కాంబ్లీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News