దక్షిణాఫ్రికా టూర్ కు రహానే ఎంపికపై ఎమ్మెస్కే ఆసక్తికర వ్యాఖ్యలు

  • ఈ నెల 26 నుంచి టీమిండియా దక్షిణాఫ్రికా టూర్
  • మూడు టెస్టుల కోసం టీమిండియా ఎంపిక
  • రహానేకు మరో అవకాశం
  • ఇటీవల ఫామ్ కోల్పోయిన రహానే
ఇటీవల తరచుగా విఫలమవుతున్న ముంబయి బ్యాట్స్ మన్ అజింక్యా రహానేను దక్షిణాఫ్రికా టూర్ కు ఎంపిక చేయడంపై క్రికెట్ వర్గాల్లో భిన్న స్పందనలు వస్తున్నాయి. దీనిపై టీమిండియా మాజీ ఆటగాడు, మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

విదేశీ పిచ్ లపై రహానే మెరుగ్గా ఆడగలడని తెలిపాడు. ఐదు రోజుల ఫార్మాట్లో అతడికి ఉన్న అనుభవం కూడా సెలెక్టర్లను ప్రభావితం చేసి ఉంటుందని పేర్కొన్నాడు. అతడి ప్రస్తుత ఫామ్ ను పట్టించుకోకుండా, రహానే నాణ్యతను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేయడం ద్వారా బీసీసీఐ మంచి నిర్ణయమే తీసుకుందని వెల్లడించాడు.

ఎమ్మెస్కే అభిప్రాయం నిజమేనని గణాంకాలు చెబుతున్నాయి. విదేశీ గడ్డపై రహానేకు మెరుగైన రికార్డు ఉంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ దేశాల్లో కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు సాధించింది రహానేనే. భారత్ వెలుపల టెస్టుల్లో రహానే 41 సగటుతో 3 వేలకు పైగా పరుగులు సాధించాడు.


More Telugu News