'పుష్ప'కి పాటలు రాయడం కష్టమైంది: చంద్రబోస్

  • సుకుమార్ తో 'ఆర్య' నుంచి పరిచయం
  • ఆయనకి సాహిత్యంపై పట్టు ఎక్కువ
  • చిత్తూరు యాసలో పాటలు రాయవలసి వచ్చింది
  • కసరత్తు చేశానన్న చంద్రబోస్  
పాటల రచయితగా చంద్రబోస్ కి మంచి పేరు ఉంది. తాజాగా 'పుష్ప' సినిమాకి ఆయన రాసిన పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 17వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి చంద్రబోస్ మాట్లాడారు.

"సుకుమార్ తో 'ఆర్య' సినిమా నుంచి నాకు మంచి పరిచయం ఉంది. ఆయనకి సాహిత్యం మీద మంచి పట్టు ఉంది. అందువలన ఆయనను ఒప్పించడం చాలా కష్టమైన విషయం. 'రంగస్థలం' సినిమాకి నేను ఎంత తేలికగా పాటలు రాశానో, 'పుష్ప' సినిమాకి పాటలు రాయడం నాకు అంత కష్టమైపోయింది.

ఈ సినిమాలో హీరో .. హీరోయిన్ ఇద్దరూ చిత్తూరు జిల్లా ప్రాంతానికి చెందినవారు. సినిమాలో వాళ్లు ఆ స్లాంగ్ మాట్లాడతారు. అందువలన పాటల్లోను చిత్తూరు యాస పదాలు పడాలి .. కచ్చితంగా వాటిని వాడాలి. అందుకు సంబంధించిన కసరత్తు కష్టమైపోయింది. అల్లు అర్జున్ .. సుకుమార్ ఆ యాస మీద సాధించిన పట్టును చూసి ధైర్యం తెచ్చుకుని రాశాను. అందువల్లనే ఈ పాటలకు అంతటి ఆదరణ లభిస్తోంది" అన్నారు.


More Telugu News