టీటీడీ పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన.. ఉద్రిక్తత!

  • టీటీడీ ఏర్పాటు చేసిన కార్పొరేషన్ లో విలీనం చేయాలని డిమాండ్
  • ఏళ్ల తరబడి పని చేస్తున్నా ఉద్యోగ భద్రత లేదని ఆందోళన
  • ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు
టీటీడీ పారిశుద్ధ్య విభాగంలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. తమను టీటీడీ ఏర్పాటు చేసిన కార్పొరేషన్ లో విలీనం చేయాలని కోరుతూ కాంట్రాక్టు కార్మికులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు తిరుపతిలోని పరిపాలన భవనం ఎదుట కాంట్రాక్టు కార్మికులు ఆందోళకు దిగారు.

ఏళ్ల తరబడి పని చేస్తున్నా తమకు ఉద్యోగ భద్రత లేకపోయిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పాదయాత్ర సమయంలో తమకు టైమ్ స్కేల్ ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని... ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించేందుకు యత్నించారు. ఈ సందర్భంగా కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని అక్కడి నుంచి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ కు తరలించారు.


More Telugu News