మెక్సికోలో ట్రక్కు బోల్తా.. 53 మంది మృతి.. మరో 54 మందికి గాయాలు
- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
- మెక్సికోలోని చియాపాస్ రాష్ట్రంలోని టక్స్‌లా గుటియెర్రెజ్‌లో ఘటన
- వలస కూలీలు ప్రయాణిస్తోన్న సమయంలో ప్రమాదం
మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని 53 మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 54 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మెక్సికోలోని చియాపాస్ రాష్ట్రంలోని టక్స్‌లా గుటియెర్రెజ్ లో ఈ ప్రమాదం జరిగింది. మెక్సికో నుంచి వలస కూలీలు అమెరికా సరిహద్దుల వైపునకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ట్రక్కులో పరిమితికి మించి బరువు ఉండడం, దాన్ని డ్రైవర్ వేగంగా నడపడం వల్లే అది ఒక్కసారిగా బోల్తా పడినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ట్రక్కులో చిన్నారులు కూడా ఉన్నారు. గాయాలపాలైన వారిని సహాయక బృందాలు ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందేలా చేస్తున్నాయి. మెక్సికో నుంచి అమెరికాకు చట్ట విరుద్ధంగా వలసలు వెళ్లే క్రమంలో కార్మికులు పదే పదే ప్రమాదాలకు గురవుతున్నారు.