కోహ్లీ స్థానంలో రోహిత్ ను కెప్టెన్ గా నియమించడానికి కారణం ఇదే: గంగూలీ

  • టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని కోహ్లీకి చెప్పాం
  • టీ20, వన్డేలకు ఇద్దరు కెప్టెన్లు ఉండటం సరికాదు
  • అందుకే రోహిత్ శర్మను వన్డే కెప్టెన్ గా చేశాం
ఇటీవలే టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ ఆయనను తప్పించింది. ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీపై కోహ్లీ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. టీమ్ లో అందరి కంటే సీనియర్ అయిన, ఎక్కువ మ్యాచ్ లు గెలిపించిన కోహ్లీని కెప్టెన్సీ నుంచి ఎలా తప్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ మార్పుపై గంగూలీ స్పందించాడు.
 
టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని కోహ్లీకి తాము ఎంతగానో చెప్పామని... అయినా ఆయన వినలేదని గంగూలీ తెలిపాడు. వైట్ బాల్ ఫార్మాట్లకు ఇద్దరు ఆటగాళ్లు నాయకత్వం వహించడం సరికాదని... టీ20, వన్డేలకు ఒకరే కెప్టెన్ గా ఉంటే బాగుంటుందని తాము భావించామని చెప్పాడు. ఈ కారణం వల్లే వన్డేలకు రోహిత్ శర్మను కెప్టెన్ గా నియమించామని తెలిపాడు.


More Telugu News