ఎన్నో ప్రగల్భాలు పలికిన కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలను ఎందుకు వెనక్కి రప్పించారు?: షబ్బీర్ అలీ

  • ఢిల్లీలో ధర్నా చేయిస్తానని కేసీఆర్ చెప్పారు
  • కేసీఆర్ మాటలు వినే రైతులు వరి వేశారు
  • ప్రభుత్వం మెడలు వంచైనా సరే ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామన్న షబ్బీర్ 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లపై ఢిల్లీలో ధర్నా చేయిస్తానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఢిల్లీ నుంచి టీఆర్ఎస్ ఎంపీలను ఎందుకు వెనక్కి రప్పించారని ప్రశ్నించారు. కేసీఆర్ మాట వినే రైతులు వరి వేశారని... ఇప్పుడు వరిని కొనుగోలు చేయనని కేసీఆర్ మాట మార్చారని విమర్శించారు. వరిని కొనుగోలు చేస్తామని అసెంబ్లీలో కూడా చెప్పారని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. టీఆర్ఎస్, బీజేపీ రెండూ దొంగలేనని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచైనా సరే ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని అన్నారు. రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజలతోనే ఉంటుందని అన్నారు.


More Telugu News