ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలడానికి కొన్ని క్షణాలముందు తీసిన వీడియో ఇది!
- తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఘటన
- ఆర్మీ హెలికాప్టర్ ను గుర్తించి వీడియో తీసిన పర్యాటకులు
- హెలికాప్టర్ నుంచి శబ్దం
- పేలిపోయిందా అంటూ తమిళ భాషలో పర్యాటకుల సంభాషణ
హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఎంఐ-17 వీ5 కూలిపోవడానికి కొన్ని క్షణాల ముందు తీసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కొందరు పర్యాటకులు ఆర్మీ హెలికాప్టర్ ను గుర్తించి దాన్ని వీడియో తీశారు. ఆ సమయంలో కొండల మధ్య పర్యాటకులు నడుచుకుంటూ వెళ్తున్నారు.
ఆ సమయంలో హెలికాప్టర్ నుంచి పెద్ద శబ్దం వచ్చింది. అది కొండ ప్రాంతంలో దిగుతున్నట్లుగా పర్యాటకులకు కనపడింది. దట్టమైన పొగ మంచులోకి హెలికాప్టర్ వెళ్తున్నట్లు ఈ వీడియోలో కనపడుతోంది. అనంతరం కొద్ది సేపటికి హెలికాప్టర్ పేలినట్లు ఆ వీడియోలో శబ్దం వినపడుతోంది. 'పేలిపోయిందా?' అంటూ తమిళ భాషలో పర్యాటకులు సంభాషించుకున్నారు. ఈ వీడియోను జాతీయ మీడియా ఛానెళ్లు కూడా ప్రసారం చేస్తున్నాయి.