ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా మన్మథరావు, శ్రీభానుమతి ప్రమాణ స్వీకారం

  • నిన్న మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రమాణం
  • ప్రమాణ స్వీకారం చేయించిన చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా
  • అనంతరం వ్యాజ్యాల విచారణ
డాక్టర్ కుంభాజడల మన్మథరావు, బొడ్డుపల్లి శ్రీభానుమతి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నిన్న మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత వీరి నియామకానికి సంబంధించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఏవీ రవీంద్రబాబు చదివి వినిపించారు. అనంతరం ఆ పత్రాలను కొత్తగా నియమితులైన న్యాయమూర్తులకు అందించారు.

ప్రమాణ స్వీకారం అనంతరం చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్ కె. మన్మథరావు.. జస్టిన్ అననుద్దీన్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్ భానుమతి పాల్గొని వ్యాజ్యాలను విచారించారు. హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, నూతన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, ఏజీ శ్రీరామ్, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, ఏఎస్‌జీ హరినాథ్, కోర్టు సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


More Telugu News