'లక్ష్య' సినిమాకి ప్లస్ పాయింట్ అదేనట!
- నాగశౌర్య నుంచి 'లక్ష్య'
- క్రీడా నేపథ్యంలో సాగే కథ
- ఆర్చరీ ప్రధానంగా వస్తున్న ఫస్టు మూవీ
- ఈ నెల 10వ తేదీన విడుదల
నాగశౌర్య కథానాయకుడిగా నటించిన 'లక్ష్య' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, నారాయణ దాస్ నారంగ్ .. రామ్మోహన్ రావు .. శరత్ మరార్ నిర్మించారు. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాను గురించి నిర్మాతలు మాట్లాడారు.
"తెలుగులో విలువిద్య నేపథ్యంలో ఇంతవరకూ సినిమాలు రాలేదు .. ఇదే ఫస్టు సినిమా. ఆర్చరీ నేపథ్యంలో సాగే ఫస్టు సినిమాను అందించడం ఆనందంగా ఉంది. ఇందులో కేవలం ఆట మాత్రమే కాదు .. ఆట చుట్టూ ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. యూత్ .. ఫ్యామిలీ ఆడియన్స్ ఆశించే అన్ని అంశాలు ఉంటాయి.
తెలుగు రాష్ట్రాల్లో 250 థియేటర్స్ లోను .. ఓవర్సీస్ లో 100 థియేటర్లలోను ఈ సినిమాను విడుదల చేస్తున్నాము. ఆల్రెడీ రెండేళ్లక్రితం శాటిలైట్ .. డిజిటల్ రైట్స్ ను అమ్మేయడం జరిగింది. క్రీడా నేపథ్యమే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుందని మేము భావిస్తున్నాము. సంగీతం .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ అవుతాయని అనుకుంటున్నాము" అని చెప్పుకొచ్చారు.