బిపిన్ రావత్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా చిత్తూరు జిల్లా వాసి... నేటి ప్రమాదంలో మృతి
- నీలగిరి కొండల్లో హెలికాప్టర్ ప్రమాదం
- 13 మంది దుర్మరణం
- సీడీఎస్ బిపిన్ రావత్ దంపతుల కన్నుమూత
- రావత్ సెక్యూరిటీ ఆఫీసర్ సాయితేజ దుర్మరణం
- సాయితేజ స్వస్థలం చిత్తూరు జిల్లా ఎగువ రేగడ గ్రామం
తమిళనాడులో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటన నేపథ్యంలో ఏపీలోని చిత్తూరు జిల్లాలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. నీలగిరి వద్ద హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధూలిక సహా 13 మంది దుర్మరణం పాలవడం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణించినవారిలో బి.సాయితేజ అనే లాన్స్ నాయక్ కూడా ఉన్నారు.
సాయితేజ స్వస్థలం చిత్తూరు జిల్లా కురబల కోట మండలం ఎగువ రేగడ గ్రామం. ఆయన 2013లో సైన్యంలో చేరారు. సైన్యంలో లాన్స్ నాయక్ ర్యాంకుకు ఎదిగిన సాయితేజ ప్రస్తుతం బిపిన్ రావత్ కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా కొనసాగుతున్నారు. రావత్ వెంట ఆయన కూడా హెలికాప్టర్ ఎక్కి ప్రమాదానికి గురయ్యారు.
సాయితేజ మృతితో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సాయితేజకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత సెప్టెంబరులో వినాయకచవితి సందర్భంగా ఆయన చివరిసారి స్వగ్రామానికి వచ్చినట్టు బంధువులు వెల్లడించారు.