తెలంగాణలో పాలన స్తంభించిపోయింది: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

  • పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు వ్యవహరించిన తీరు దురదృష్టకరం
  • కేసీఆర్ కు ఓట్లు, నోట్లు, సీట్లు మాత్రమే కావాలి
  • ప్రజల సంక్షేమం కేసీఆర్ కు అవసరం లేదు
పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు వ్యవహరించిన తీరు దురదృష్టకరమని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. వారి తీరును చూసి రైతులు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

ధాన్యం కొనలేని దారుణ స్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని అన్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలు చేయాలని వారే ఆందోళన చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓట్లు, నోట్లు, సీట్లు మాత్రమే కావాలని... ప్రజల సంక్షేమం ఆయనకు అవసరం లేదని చెప్పారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయిందని అన్నారు. ఐకేపీ సెంటర్లను ఒకసారి సందర్శించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసైని ఆయన కోరారు.


More Telugu News