హైదరాబాదు వాటర్ ట్యాంకు ఘటనలో మృతుడిని గుర్తించిన పోలీసులు

  • రాంనగర్ పరిధిలో జలమండలి ట్యాంకులో శవం
  • తీవ్ర ఆందోళనకు గురైన ప్రజలు
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
  • మృతుడు కిశోర్ అనే వ్యక్తిగా గుర్తింపు
  • 15 రోజుల కిందట అదృశ్యమైన కిశోర్
హైదరాబాదులో రాంనగర్ పరిధిలో జలమండలి వాటర్ ట్యాంకులో శవం పడివుండడం తీవ్ర కలకలం రేపింది. దీనిపై ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.... మృతుడు ఎవరన్నది గుర్తించారు.

అతడి పేరు కిశోర్. చిక్కడపల్లిలోని అంబేద్కర్ నగర్ వాసి. రెండు వారాల కిందట కిశోర్ కనిపించడంలేదంటూ చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు అందింది. వాటర్ ట్యాంకు నుంచి తెలికితీసిన మృతదేహం అతడిదేనని గుర్తించారు. అతడి చెప్పుల ఆధారంగా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. కాగా, అతడి మరణం ఎలా సంభవించింది? అన్నది తేలాల్సి ఉంది.


More Telugu News