తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదం.... కొండ దిగువభాగంలో మృతదేహాలు..?
- నీలగిరి ప్రాంతంలో హెలికాప్టర్ దుర్ఘటన
- హెలికాప్టర్ లో బిపిన్ రావత్ కుటుంబం
- ఇద్దరిని ఆసుపత్రికి తరలించిన సహాయ బృందాలు
- కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
తమిళనాడులోని నీలగిరి ప్రాంతంలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్, ఆయన కుటుంబ సభ్యులు ఈ హెలికాప్టర్ లో ఉన్నట్టు భావిస్తున్నారు. వెల్లింగ్టన్ సైనిక స్థావరం నుంచి గాల్లోకి లేచిన కొద్దిసేపటికే ఈ హెలికాప్టర్ అక్కడికి దగ్గర్లోని ఓ హోటల్ వద్ద కూలిపోయింది.
ఈ ఘటనలో 80 శాతం కాలిన గాయాలతో ఉన్న ఇద్దరిని రక్షించిన సహాయక బృందాలు వారిని ఆసుపత్రికి తరలించాయి. కాగా, కొండ దిగువ భాగంలో పలువురి దేహాలు పడివున్నట్టు గుర్తించారు. వాటిని వెలికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభమైందని భారత వాయుసేన తెలిపింది.