ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: బ్రహ్మానందం

  • 38 ఏళ్లుగా కష్టపడుతున్నాను
  • 1254 సినిమాలు చేశాను
  • టైమ్ ప్రకారమే పనిచేస్తాను
  • శరీరం సహకరించాలన్న బ్రహ్మానందం  
తెలుగు తెరపై హాస్యరసానికి అధినాయకుడిగా బ్రహ్మానందం కనిపిస్తారు. 1200 సినిమాలకి పైగా చేసిన ఆయన, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు. "బ్రహ్మానందాన్ని పెట్టుకుంటే ఆయన టైమ్ కే ఆయన వస్తారు .. మన టైమ్ కి రారు .. సాయంత్రం 5 గంటలకే వెళ్లిపోతారు. ఆ టైమ్ కి వెళ్లిపోవాలా? అది రూలా? అని విమర్శించేవారికి మీ సమాధానం ఏమిటి?" అని అలీ అడిగాడు.

అందుకు బ్రహ్మానందం స్పందిస్తూ .. "ఫస్టు పాయింట్ ఏమిటంటే అసలు అలాంటి వాళ్లకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వాళ్లకి సమాధానంగా నీ ద్వారా సమాధానం చెప్పాలని నేను అనుకోవడం లేదు. ప్రేక్షకులకు చెబుతున్నాను .. నేను పడినంత శ్రమ ఎవరూ పడలేదు. 38 సంవత్సరాల కెరియర్లో 1254 సినిమాలు చేశాను .. నేనే డబ్బింగులు చెప్పుకున్నాను.

నేను రోజుకి 18 గంటలు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. నేను .. బాబు మోహన్ .. కోట .. కలిసి పనిచేస్తున్నప్పుడు, ఎక్కడ ఏ ట్రైన్ ఎక్కుతున్నామో .. ఏ ట్రైన్ దిగుతున్నామో .. ఎక్కడ తింటున్నామో .. ఎక్కడ పడుకుంటున్నామో మాకే తెలియదు. అలా డే అండ్ నైట్ కష్టపడిన రోజులు ఉన్నాయి. అంతగా అలసిపోవడం వలన ఇక ఇప్పుడు నేను ఒక టైమ్ పెట్టుకున్నాను. ఆ టైమ్ ప్రకారమే పనిచేస్తాను .. శరీరం కూడా సహకరించాలి కదా" అని చెప్పుకొచ్చారు.


More Telugu News