ఫేక్ వీసాలతో కువైట్ వెళ్లేందుకు యత్నం... శంషాబాద్ ఎయిర్ పోర్టులో 44 మంది మహిళలను అడ్డుకున్న అధికారులు

  • పోలీసుల అదుపులో ఏపీ, తెలంగాణ, గోవా, తమిళనాడు మహిళలు
  • ఏజెంట్ మోసం చేశాడా అనే కోణంలోనూ దర్యాప్తు
  • మహిళల నుంచి నకిలీ వీసాల స్వాధీనం
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫేక్ వీసాల గుట్టురట్టయింది. నకిలీ వీసాలతో కువైట్ వెళ్లేందుకు ప్రయత్నించిన 44 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళలను ఆర్జీఐ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఆ మహిళలను ఏజెంట్ మోసం చేశాడా? లేక వారే ఉద్దేశపూర్వకంగా నకిలీ వీసాలతో వెళుతున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ మహిళలను ఏపీ, తెలంగాణ, గోవా, తమిళనాడు రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించారు.


More Telugu News