దక్షిణాఫ్రికాలో కరోనా నాలుగో వేవ్... 25 శాతానికి పెరిగిన పాజిటివిటీ రేటు

  • ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కలకలం
  • దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్
  • వేగంగా వ్యాపిస్తున్న వైనం
  • వ్యాక్సినేషన్ ను ముమ్మరం చేసిన దక్షిణాఫ్రికా
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తొలుత దక్షిణాఫ్రికాలోనే వెలుగు చూడడం తెలిసిందే. దక్షిణాఫ్రికా నుంచి వస్తున్న ప్రయాణికులు అంటే ప్రపంచదేశాలు హడలిపోతున్నాయి. ఆ దేశం నుంచి వస్తున్న వారిలో చాలామంది ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అవుతుండడమే అందుకు కారణం.

అటు దక్షిణాఫ్రికాలో పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. రెండు వారాల కిందట ఈ సఫారీ దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 2 శాతం ఉండగా, ఇప్పుడది ఏకంగా 25 శాతానికి పెరిగింది. రోజువారీ కేసుల సంఖ్య 10 వేలకు పైగా నమోదవుతోంది. ఓవైపు ఒమిక్రాన్, మరోవైపు సాధారణ కరోనా కేసులతో దక్షిణాఫ్రికా అతలాకుతలం అవుతోంది.  

ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కరోనా నాలుగో వేవ్ నడుస్తోందని దేశాధ్యక్షుడు సిరిల్ రామఫోసా వెల్లడించారు. మరికొన్నివారాల్లో వైరస్ సంక్రమణ రేటు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారని వివరించారు. పరిస్థితిని సమీక్షించేందుకు త్వరలోనే జాతీయ కరోనా వైరస్ కమాండ్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ప్రధానంగా వ్యాక్సినేషన్ పై దృష్టి పెట్టామని పేర్కొన్నారు.


More Telugu News