సిరివెన్నెల చివరిపాట రిలీజ్ కి టైమ్ ఫిక్స్!
- విభిన్నమైన కథాంశంతో 'శ్యామ్ సింగ రాయ్'
- కలకత్తా నేపథ్యంలో నడిచే కథ
- దర్శకుడిగా రాహుల్ సాంకృత్యన్
- ఈ నెల 24వ తేదీన సినిమా విడుదల
'శ్యామ్ సింగ రాయ్'గా త్వరలో ప్రేక్షకులను పలకరించడానికి నాని రెడీ అవుతున్నాడు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, వెంకట్ బోయనపల్లి నిర్మించాడు. చారిత్రక నేపథ్యంతో కలకత్తా చుట్టూ తిరిగే కథతో నడిచే ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు.
సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. సిరివెన్నెల ఈ సినిమా కోసం తన చివరి పాటను రాసినట్టుగా రాహుల్ సాంకృత్యన్ చెప్పాడు. ఈ నెల 7వ తేదీన ఆ పాటను రిలీజ్ చేయనున్నామని అన్నాడు. తాజాగా ఆ పాటకి టైమ్ ఫిక్స్ చేశారు. రేపు సాయంత్రం 4 గంటలకు ఈ పాటను విడుదల చేయనున్నారు.
ఈ సినిమాలో నాని సరసన నాయికలుగా సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా సెబాస్టియన్ అలరించనున్నారు. ఈ ముగ్గురి పాత్రలకు ప్రాధాన్యత ఉంటుందనేది అందరిలో ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా సాయిపల్లవి లుక్ కూడా ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమవుతోంది.