నేను కూడా సిక్స్ ప్యాక్ ట్రై చేస్తాను: శర్వానంద్

  • స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే 'లక్ష్య'
  • నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
  • నాగశౌర్య సిక్స్ ప్యాక్ పై శర్వా కామెంట్
  • కాబోయే సూపర్ స్టార్ ఆయనే అంటూ ప్రశంస  
నాగశౌర్య - కేతిక జంటగా నటించిన 'లక్ష్య' సినిమా, విలువిద్య నేపథ్యంలో నడుస్తుంది. నారాయణ దాస్ నారంగ్ .. రామ్మోహన్ రావు .. శరత్ మరార్ నిర్మించిన ఈ సినిమాకి, సంతోష్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరువుకుంది.

ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన శర్వానంద్ మాట్లాడుతూ .. "స్పోర్ట్స్ నేపథ్యంలోని సినిమాలను తీయడం .. చేయడం చాలా కష్టం. అలాంటి పాత్రలకు ట్యూన్ కావడానికి ఎంతటి కసరత్తు చేయాలనేది నాకు తెలుసు. ఈ మధ్య కాలంలో క్రీడా నేపథ్యంలో వచ్చిన సినిమాలలో చాలావరకూ హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఉంది.

ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ తో కనిపించడానికి నాగశౌర్య చాలా కష్టపడ్డాడు .. ఆయనే నాకు స్ఫూర్తి. ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలు పూర్తికాగానే, నేను కూడా సిక్స్ ప్యాక్ ట్రై చేస్తాను. అప్పటివరకూ మరో సినిమాను చేయను. నాగశౌర్యకి తప్పకుండా హిట్ పడుతుందని నేను అనుకుంటున్నాను. మన బాస్ మెగాస్టార్ అన్నట్టుగా కాబోయే సూపర్ స్టార్ ఆయనే" అంటూ ముగించాడు.


More Telugu News