రిస్క్ ఎక్కువగా ఉన్నవారికి మూడో డోసు వ్యాక్సిన్.. ఈరోజు కీలక నిర్ణయం తీసుకోనున్న కోవిడ్ ప్యానల్!
- క్యాన్సర్, ఎయిడ్స్, రెస్ట్ లో ఉన్నవారికి మూడో డోసు ఇచ్చే అవకాశం
- దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారు, వయోవృద్ధులకు కూడా
- ఇప్పటికే బూస్టర్ డోస్ కు అనుమతి పొందిన సీరమ్
దేశంలో ఒమిక్రాన్ భయాలు పెరిగిపోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఫిబ్రవరి నాటికి స్వల్ప స్థాయిలో కరోనా థర్డ్ వేవ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడో డోసు వ్యాక్సినేషన్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బూస్టర్ డోస్ కోసం తమకు టీకాలను పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే పలు రాష్ట్రాలు కోరాయి.
ఈ నేపథ్యంలో మూడో డోసు ఇవ్వడంపై ఈరోజు కోవిడ్ ప్యానల్ నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా రిస్క్ లో ఉన్నవారికి మూడో డోసును అందించే విధంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. థెరపీ చేయించుకుంటున్న క్యాన్సర్ పేషెంట్లు, ఎయిడ్స్ పేషెంట్లు, సుదీర్ఘకాలంగా అనారోగ్యాలతో బాధపడుతున్నవారు, వయోవృద్ధులకు మూడో డోసు వ్యాక్సిన్ వేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా ఇమ్యూనిటీ తగిన స్థాయిలో పెరగని వారికి కూడా మూడో డోస్ ఇచ్చే అవకాశం ఉంది. తాజాగా కొవీషీల్డ్ ను బూస్టర్ డోస్ గా ఉపయోగించేందుకు డ్రగ్ రెగ్యులేటర్ డీసీజీఐ నుంచి సీరమ్ ఇన్స్టిట్యూట్ అనుమతి పొందిన సంగతి తెలిసిందే.