సినీ గేయరచయిత కందికొండ కుమార్తె లేఖపై స్పందించిన కేటీఆర్

  • గతంలో ఆదుకున్నాం.. ఇప్పుడూ ఆదుకుంటామని హామీ
  • మంత్రి తలసాని, తన అధికారులు చూసుకుంటారని వెల్లడి
  • ఇంటిని కేటాయించాలంటూ కేటీఆర్ కు మాతృక లేఖ
తెలంగాణ సినీ గేయ రచయిత కందికొండ కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. తన తండ్రి చికిత్సకు గతంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో అండగా నిలిచిందని, ఇప్పుడు తమ కుటుంబం ఆర్థికంగా చితికిపోయిందని, ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామంటూ మంత్రి కేటీఆర్ కు కందికొండ కూతురు మాత్రుక లేఖ రాసిన సంగతి తెలిసిందే. చిత్రపురి కాలనీలో ఇంటి కోసం గతంలో తన తండ్రి రూ.4 లక్షలు కట్టారని, ఇప్పటికీ ఇల్లు మంజూరు కాలేదని, చిత్రపురి కాలనీ లేదా వేరేచోట ప్రభుత్వం ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని ఆమె ఆ లేఖలో కోరారు.

దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కందికొండ కుటుంబానికి గతంలో అండగా ఉన్నామని, ఇప్పుడు కూడా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఇంటి విషయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తన ఆఫీసు అధికారులు సమన్వయం చేస్తారని, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తారని పేర్కొన్నారు. కాగా, ఆరు నెలల క్రితం కందికొండ ఆరోగ్యం విషమించడంతో కిమ్స్ లో ఆయనకు ప్రభుత్వం తరఫున చికిత్స అందించారు. ఆ తర్వాత మెడికవర్ ఆసుపత్రిలో ఆయన వెన్నెముకకు శస్త్రచికిత్స చేశారు. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు.



More Telugu News