ప్రమాదకరంగా ఆర్కే బీచ్.. ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రం
- 200 మీటర్ల మేర భూమి కోత
- పలు చోట్ల కుంగిపోయిన భూమి
- కూలిపోయిన పిల్లల పార్కు ప్రహరీ
- పర్యాటకులకు అనుమతిపై నిషేధం
జవాద్ తుపాను కారణంగా విశాఖలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఆర్కే బీచ్ లో సముద్రం ముందుకొచ్చింది. దుర్గాలమ్మ ఆలయం వరకు 200 మీటర్లు భూమి కోతకు గురైంది. పలు చోట్ల భూమి కుంగిపోయింది. దీంతో సమీపంలోని పిల్లల పార్కు ప్రహరీ గోడ కూలిపోయింది. బల్లలు విరిగాయి. ఈ నేపథ్యంలోనే ఆర్కే బీచ్ లోకి పర్యాటకులను నిషేధించారు. ఎవరూ రాకుండా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
కాగా, తుపాను ఇవాళ మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరి తీరాన్ని తాకే అవకాశముంది. ఇది బలహీన పడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. కాగా, దాని ప్రభావం వల్లే సముద్రం ముందుకొచ్చి ఉండొచ్చని అంటున్నారు.