11వ వికెట్ తీసిన అజాజ్.. అర్ధ సెంచరీ చేసి అవుటైన మయాంక్

  • 62 పరుగులు చేసి అవుటైన మయాంక్
  • మయాంక్‌తో వికెట్ల వేటను ప్రారంభించిన అజాజ్
  • 350 పరుగులు దాటిన భారత్ ఆధిక్యం
న్యూజిలాండ్‌తో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న చివరిదైన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ హీరో మయాంక్ అగర్వాల్ రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణించాడు. 62 పరుగుల వద్ద అజాజ్ పటేల్‌ బౌలింగులో విల్ యంగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

భారత తొలి ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు నేలకూల్చిన అజాజ్‌కు ఇది 11వ వికెట్ కావడం గమనార్హం. పుజారా 47, గిల్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 113 పరుగులు చేసి 376 పరుగుల ఆధిక్యంలో ఉంది.


More Telugu News