లుంగీలు ధరించేవాళ్లందరూ క్రిమినల్స్ కాదుl: యూపీ మంత్రిపై కాంగ్రెస్ ధ్వజం

  • లుంగీలు ధరించేవాళ్లు శాంతిభద్రతలకు సవాల్ అన్న మంత్రి
  • మంత్రి వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నేత అల్వీ
  • ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆరోపణ
  • బీజేపీ కుయుక్తులు ప్రజలు గ్రహించారని వెల్లడి
ఉత్తరప్రదేశ్ మంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య నిన్న ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాలకు ఆగ్రహం కలిగించాయి. ఉత్తరప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో లుంగీ, టోపీ ధరించేవాళ్లు శాంతిభద్రతలకు సవాల్ గా మారారని కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యానించారు. 2017 తర్వాత ఎప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇలాంటి నేరగాళ్లు కనిపించేవాళ్లు కాదని అన్నారు. దీనిపై కాంగ్రెస్ నేత రషీద్  అల్వీ స్పందించారు.

లుంగీలు ధరించే వారందరూ క్రిమినల్స్ కాదని స్పష్టం చేశారు. మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో హిందువులు లుంగీలు ధరిస్తారని, మరి యూపీ మంత్రి వ్యాఖ్యల ప్రకారం వారందరూ నేరస్తులేనా? అని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గేందుకు బీజేపీ ప్రత్యేకంగా ఓ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుందని  అల్వీ ఆరోపించారు. బీజేపీ కుయుక్తులు ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపారు. ఆ విషయం తెలిసే బీజేపీ భయపడుతోందని అన్నారు.


More Telugu News