ఢిల్లీకి వచ్చి వీళ్లు అడుగుతున్నది ఇదే: వైసీపీ నేతలపై సీఎం రమేశ్ ఫైర్

  • సగం పాలన అయిపోయింది.. అభివృద్ధి శూన్యం
  • ఢిల్లీకి వచ్చి పథకాలు కాకుండా అప్పులివ్వాలని కోరుతున్నారు
  • రాష్ట్రంలో అరాచకం తప్ప మరేమీ లేదు
వైసీపీ నేతల తీరుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ మండిపడ్డారు. జగన్ ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని సగం కాలం గడిచిపోయిందని... కానీ రాష్ట్రంలో ఇంతవరకు చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. గుట్కా, మట్కా, గంజాయి, ఇసుక అక్రమాలు మాత్రం బాగా జరుగుతున్నాయని విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్ కు జగన్ పునాది రాయి వేసి రెండేళ్లు గడిచిందని... అక్కడ పునాదిరాయి తప్ప మరేమీ లేదని దుయ్యబట్టారు.

ప్రభుత్వాన్ని తప్పుపట్టిన అందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని... ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కూడా తప్పుపట్టారని, ఆయనపై కూడా అట్రాసిటీ కేసు పెడతారా? అని ప్రశ్నించారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అరాచకం తప్ప మరేమీ లేదని అన్నారు. రాష్ట్రానికి పథకాలు కావాలని ఢిల్లీకి వచ్చే వైసీపీ నేతలు కోరడం లేదని... అప్పులు ఇవ్వాలని కోరుతున్నారని ఎద్దేవా చేశారు.


More Telugu News