తీవ్ర తుపానుగా బలపడిన ‘జవాద్’.. రేపు రాత్రికి బలహీనపడే అవకాశం

  • విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం
  • ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం
  • గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ‘జవాద్’
బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుపాను మరింత బలపడింది. ప్రస్తుతం విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 250 కిలోమీటర్లు, పారదీప్‌కు 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ఇది వాయవ్య దిశగా కదులుతోంది. తుపాను క్రమంగా తన దిశ మార్చుకుని రేపు మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరి తీరానికి చేరువగా వెళ్లే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు.  

అలాగే, రేపు రాత్రికి బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. జవాద్ తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో చాలాచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోనూ కొన్నిచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పారు.


More Telugu News