రేపే 'భీమ్లా నాయక్' నుంచి ఫోర్త్ సింగిల్!
- పవన్ హీరోగా 'భీమ్లా నాయక్'
- మరో ప్రధానమైన పాత్రలో రానా
- సంగీత దర్శకుడిగా తమన్
- జనవరి 12వ తేదీన విడుదల
పవన్ కల్యాణ్ .. రానా ప్రధాన పాత్రధారులుగా సాగర్ కె చంద్ర 'భీమ్లా నాయక్' సినిమాను రూపొందించాడు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా, 'అయ్యప్పనుమ్ కోషియుమ్' అనే మలయాళ మూవీకి రీమేక్. నిత్యామీనన్ .. సంయుక్త మీనన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు.
ఈ సినిమా నుంచి ఇంతవరకూ మూడు సింగిల్స్ వదలగా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాల్గొవ సింగిల్ ను ఈ నెల 1వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సిరివెన్నెల మరణం కారణంగా వాయిదా వేసుకున్నారు. ఆ ఫోర్త్ సింగిల్ ను రేపు ఉదయం 10:08 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించారు.
'అడవితల్లి మాట' అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. ఈ పాట ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. నిజానికి సంక్రాంతికి ఒక రేంజ్ లో పోటీ ఉంది. అందువలన ఇప్పుడు అందరిలో అంతకంతకూ కుతూహలం పెరిగిపోతోంది.