'మరక్కార్' గురించి వినిపిస్తున్న మాట అదే!

  • 100 కోట్ల బడ్జెట్ సినిమా
  • కేరళకి చెందిన వీరుడి కథ
  • వివిధ భాషల్లో భారీ విడుదల
  • పెదవి విరుస్తున్న ప్రేక్షకులు
మోహన్ లాల్ కథానాయకుడిగా 100 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన సినిమానే 'మరక్కార్'. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, మలయాళంతో పాటు వివిధ భాషల్లో నిన్న విడుదలైంది. 16వ శతాబ్దానికి చెందిన కుంజాలి మరక్కార్ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

పోర్చుగీసువారిని ఎదిరించిన మరక్కార్ అనే వీరుడి కథ ఇది. ఈ సినిమా ప్రచార చిత్రాలు .. వీడియోలు అందరిలో ఎంతో ఆసక్తిని రేకెత్తించాయి. సునీల్ శెట్టి .. అర్జున్ .. సుహాసిని .. కీర్తి సురేశ్ .. మంజు వారియర్ వంటి ఆర్టిస్టులు, వారి వేషధారణ ఆడియన్స్ లో మరింత ఆసక్తిని రేకెత్తించాయి.

అయితే కథాకథనాల పరంగా ఈ సినిమా ఆకట్టుకోలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఖర్చు తప్ప కథ బలంగా కనిపించడం లేదని అంటున్నారు. స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడం వలన, సాధారణ ప్రేక్షకులకు అర్థం కావడం లేదని చెప్పుకుంటున్నారు.  ప్రియదర్శన్ వంటి ఒక దర్శకుడి సినిమాకి ఇలాంటి టాక్ రావడం చిత్రమే.


More Telugu News