ప్రంపంచ వ్యాప్తంగా 'అఖండ' భారీ కలెక్షన్లు.. తొలిరోజు వసూళ్లు ఎంతంటే..?

  • హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య, బోయపాటి శ్రీను
  • తొలిరోజు రూ. 23 కోట్ల గ్రాస్ వసూలు చేసిన 'అఖండ'
  • ఓవర్సీస్ లో రూ. 3.24 కోట్ల వసూళ్లు
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ 'అఖండ' సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో బాలయ్య నటవిశ్వరూపానికి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో సైతం ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. తొలిరోజు వసూళ్లను చూస్తుంటే ఈ చిత్రం భారీ కలెక్షన్లను సాధించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ చిత్రానికి తొలిరోజు రూ. 23 కోట్ల గ్రాస్, రూ. 15.39 కోట్ల నెట్ వసూళ్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఓవర్సీస్ లో రూ. 3.24 కోట్లు వసూలు చేసింది.  

తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా కలెక్షన్స్ వివరాలు:
  • నైజాం - రూ. 4.39 కోట్లు
  • సీడెడ్ - రూ. 4.02 కోట్లు
  • ఉత్తరాంధ్ర - రూ. 1.36 కోట్లు
  • ఈస్ట్ గోదావరి - రూ. 1.05 కోట్లు
  • వెస్ట్ గోదావరి - రూ. 96 లక్షలు
  • గుంటూరు - రూ. 1.87 కోట్లు
  • కృష్ణా - రూ. 81 లక్షలు
  • నెల్లూరు - రూ. 93 లక్షలు

కరోనా సెకండ్ వేవ్ తర్వాత అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లను సాధించిన టాలీవుడ్ చిత్రంగా 'అఖండ' రికార్డులకెక్కింది. మరోవైపు ఈ చిత్రం రూ. 53 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఈ నేపథ్యంలో రూ. 54 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ లోకి వెళ్తుంది. వీకెండ్ సమయం కావడంతో శనివారం, ఆదివారాలు ఎలాగూ ఈ సినిమాకు భారీ కలెక్షన్లు ఉంటాయి. దీంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయడమే కాకుండా.. భారీ లాభాలను సాధిస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.


More Telugu News