పీఆర్సీపై గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జ‌గ‌న్

  • చిత్తూరులో ప‌ర్య‌టించిన జ‌గ‌న్
  • సీఎంను క‌లిసిన ఉద్యోగ సంఘాల‌ ప్ర‌తినిధులు
  • 10 రోజుల్లో పీఆర్సీ ప్ర‌క‌ట‌న చేస్తామ‌న్న జ‌గ‌న్
ఇటీవ‌ల‌ వరద బీభత్సానికి గురై తీవ్రంగా న‌ష్ట‌పోయిన బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ క‌డ‌ప‌, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ప‌ర్య‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ రోజు చిత్తూరు జిల్లా పర్యటన ముగించుకున్న జ‌గ‌న్ నెల్లూరు జిల్లా పర్యటనకు బయలుదేరారు.

అంత‌కుముందు సీఎం జగన్‌ను తిరుపతి సరస్వతీ నగర్‌లో ఉద్యోగుల తరఫున కొందరు ప్రతినిధులు కలిశారు. పీఆర్సీపై ప్ర‌క‌ట‌న చేయాల‌ని వారు జ‌గ‌న్‌ను కోరారు. దీంతో  పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని, ఉద్యోగుల‌కు శుభవార్త తెలుపుతూ దీనిపై పది రోజుల్లో ప్రకటన చేస్తామని జగన్ ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు.

కాగా, కాసేప‌ట్లో నెల్లూరు జిల్లా చేరుకోనున్న జ‌గ‌న్ వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల ప్ర‌జ‌ల‌తో ముఖాముఖి మాట్లాడ‌నున్నారు. ఇప్ప‌టికే క‌డ‌ప‌, చిత్తూరులో ఆయ‌న అక్క‌డి ప‌రిస్థితుల‌ను ప‌రిశీలించి, అన్ని ర‌కాలుగా ఆదుకుంటామ‌ని ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. స‌హాయ‌క చ‌ర్య‌లు స‌మ‌ర్థంగా చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.


More Telugu News