రైలు కింద పడబోయిన మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసు.. వీడియో ఇదిగో
- పశ్చిమ బెంగాల్‌లో ఘటన
- ఎక్స్‌ప్రెస్ రైలు కదులుతోన్న సమయంలో దిగిన మహిళ
- రైలు, ప్లాట్‌ఫాం మధ్య పడబోయిన వైనం
రైలు కింద పడబోయిన ఓ మహిళ ప్రాణాలు కాపాడాడు ఓ పోలీసు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లోని పురులియా రైల్వే స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైలు కదులుతోన్న సమయంలో ఓ మహిళ అందులోంచి దిగింది. ఆ వెంటనే మరో మహిళ దిగబోతుండగా పట్టుతప్పి ప్లాట్‌ఫాం, రైలు మధ్య పడబోయింది.
దాదాపు ఆమె రైలు కింద పడిపోనుందన్న సమయంలో అక్కడి ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్‌పెక్టర్ బబ్లు కుమార్ పరుగులు తీసి ఆమెను ప్లాట్‌ఫాం మీదకు లాగాడు. దీంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. మహిళను రక్షించిన ఆర్పీఎఫ్ ఇన్స్‌పెక్టర్‌పై అధికారులు ప్రశంసల జల్లు కురిపించారు. ఆ మహిళ ప్రాణాలను ఆయన కాపాడిన వీడియోను ఆర్పీఎఫ్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
రైల్వే స్టేషన్‌లలో తరుచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటుండడం గమనార్హం. కదులుతోన్న రైలు నుంచి దిగవద్దని అధికారులు ఎంతగా ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రయాణికులు ఇటువంటి ఘటనలకు పాల్పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.