రాజశేఖర్ సినిమాకు ఫ్యాన్సీ ఆఫర్లు!
- రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న 'శేఖర్'
- డైరెక్ట్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం రూ. 22 నుంచి 25 కోట్ల ఆఫర్లు
- మలయాళ హిట్ మూవీ 'జోసెఫ్'కు ఇది రీమేక్
డాక్టర్ రాజశేఖర్ హీరోగా తెరకెక్కుతున్న 'శేఖర్' సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం రాజశేఖర్ 91వ సినిమా కావడం గమనార్హం.
రాజశేఖర్ కూతుళ్లైన శివానీ, శివాత్మికలు ఇతర నిర్మాతలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన ముస్కాన్, అను సితార కథానాయికలుగా నటిస్తున్నారు. అభినవ్ గోమఠం, కన్నడ కిశోర్, సమీర్, తనికెళ్ల భరణి, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్రలు ఇతర ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. 59 ఏళ్ల రాజశేఖర్ ఈ చిత్రంలో కొన్ని రిస్కీ షాట్స్ చేసినట్టు తెలుస్తోంది. జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. స్క్రీన్ ప్లే విభాగం కూడా ఆమెనే చూసుకోవడం గమనార్హం. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
మరోవైపు రాజశేఖర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను డైరెక్ట్ రిలీజ్ కింద తీసుకునేందుకు కొన్ని ఓటీటీలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఫ్యాన్సీ రేట్లు కూడా ఆఫర్ చేశాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం.. 'శేఖర్' సినిమా డైరెక్ట్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం రూ. 22 నుంచి 25 కోట్ల ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తోంది.
ఓటీటీలు 'శేఖర్' మూవీపై ప్రత్యేకంగా దృష్టి సారించడానికి రెండు కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ సినిమా జానర్ కాగా.. మరొక కారణం ఇది ఆల్రెడీ హిట్టయిన మలయాళ మూవీ 'జోసెఫ్'కు రీమేక్. పేరుకు ఇది రీమేక్ మూవీ అయినప్పటికీ... తెలుగు ఆడియన్స్ కు నచ్చే విధంగా కథ-స్క్రీన్ ప్లేలో మార్పులుచేర్పులు చేశారు.