‘అంకుల్ సినిమా అద్భుతంగా ఉంది’ అన్నారు.. అలా అనడం నాకు నచ్చలేదు: బాలకృష్ణ
- హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో సినిమా చూసిన బాలయ్య
- హిట్ టాక్ సొంతం చేసుకున్న ‘అఖండ’
- కొత్తదనాన్ని ఆదరిస్తారని చెప్పడానికి సినిమా విజయం నిదర్శమన్న బాలకృష్ణ
- పిల్లలు తనను అంకుల్ అనడం బాగాలేదంటూ చమత్కారం
పిల్లలు తనను అంకుల్ అనడం ఏమీ బాగోలేదని టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ చమత్కరించారు. ఆయన నటించిన ‘అఖండ’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. హిట్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమాను అభిమానులతో కలిసి హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బాలయ్య.. తొలుత అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్తదనాన్ని వారు ఆదరిస్తారని ఈ సినిమా మరోమారు రుజువు చేసిందన్నారు.
పిల్లలకు కూడా ఈ సినిమా బాగా నచ్చిందన్న ఆయన.. వారు తన దగ్గరికి వచ్చి ‘అంకుల్.. ఈ సినిమా అద్భుతంగా ఉంది’’ అన్నారని, వారికి సినిమా అంతగా నచ్చడం బాగున్నా తనను అంకుల్ అనడమే బాగోలేదని చమత్కరించారు. సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంతగానో కష్టపడ్డారని, ఈ సినిమాలో ఎన్నో నిజాల్ని చూపించామని బాలకృష్ణ పేర్కొన్నారు. పనిలో దేవుడు ఉన్నాడని తాము నమ్ముతామని బాలయ్య అన్నారు.