జర్మనీలో మళ్లీ లాక్ డౌన్... వ్యాక్సిన్ తీసుకోని వాళ్లు బయట తిరగడంపై నిషేధం!

  • వేగంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్
  • 20కి పైగా దేశాల్లో ఉనికి
  • అప్రమత్తమైన ఈయూ దేశాలు
  • జర్మనీలో షరతులతో కూడిన లాక్ డౌన్
  • వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసే యోచనలో జర్మనీ 
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా పాకిపోతోంది. మొన్నటికి ఆరు దేశాల్లో ఉనికి చాటుకున్న ఈ నయా మహమ్మారి ఇప్పుడు 20కి పైగా దేశాల్లో వెలుగుచూసింది. ఈ క్రమంలో యూరప్ దేశాలు అప్రమత్తం అయ్యాయి. జర్మనీలోనూ కఠిన ఆంక్షలకు తెరలేపారు. దేశంలో లాక్ డౌన్ విధిస్తున్నట్టు జర్మనీ ప్రభుత్వం ప్రకటన చేసింది.

అయితే, ఈసారి షరతులతో కూడిన లాక్ డౌన్ విధించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారికే ఈ లాక్ డౌన్ వర్తిస్తుంది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోని వారు బయట తిరగడం నిషేధం. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్న వారిపై ఎలాంటి నిషేధం ఉండదు. కాగా, జర్మనీలో వ్యాక్సినేషన్ ను తప్పనిసరి చేసేందుకు ఓ చట్టం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.


More Telugu News