ఈ పాటను సీతారామశాస్త్రి అంకుల్ కు అంకితం ఇస్తున్నాం: దేవి శ్రీ ప్రసాద్
- తీవ్ర అనారోగ్యంతో సిరివెన్నెల కన్నుమూత
- నేడు 'గుడ్ లక్ సఖి' చిత్రం నుంచి పాట విడుదల
- ఇంతందంగా అంటూ సాగే పాటకు శ్రీమణి సాహిత్యం
- పాటను ఆలపించిన దేవి శ్రీ ప్రసాద్
కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గుడ్ లక్ సఖి'. ఆది పినిశెట్టి, జగపతి బాబు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి నగేశ్ కుకునూర్ దర్శకుడు. కాగా, ఈ చిత్రబృందం నేడు 'ఇంతందంగా' అనే పాటను విడుదల చేసింది. దీనిపై చిత్ర సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్పందించారు.
"ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి అంకుల్ కు అంకితం ఇస్తున్నాం. నా గొంతు బాగుంటుందని ఆయన ఎప్పుడూ మెచ్చుకునేవారు. ఈ పాటను నేనే పాడాను. అందుకే ఈ పాటనే ఆయనకు అంకితం ఇవ్వాలని నిర్ణయించాం" అని దేవి శ్రీ ప్రసాద్ వివరించారు. కాగా, 'ఇంతందంగా' అంటూ సాగే ఈ గీతానికి శ్రీమణి అందమైన సాహిత్యం అందించారని దేవి శ్రీ ప్రసాద్ కొనియాడారు.
సుప్రసిద్ధ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.