కడప జిల్లాలో వరద బాధితులపై సీఎం జగన్ వరాల జల్లు
- కడప జిల్లాలో జలవిలయం
- రాజంపేట మండలంలో వరద బీభత్సం
- పులపుత్తూరులో వరద బాధితులకు సీఎం జగన్ పరామర్శ
- వారితో నేరుగా మాట్లాడిన వైనం
కడప జిల్లాలో వరద బీభత్సానికి గురైన వారి పట్ల సీఎం జగన్ ఉదారంగా స్పందించారు. రాజంపేట మండలం పులపుత్తూరులో పర్యటించిన ఆయన వరద బాధితులతో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వరద బాధితులకు ఊరటనిచ్చేలా పలు హామీలు ఇచ్చారు. భారీ వర్షాలు, వరదలతో ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. పులపుత్తూరులో 293 ఇళ్లు దెబ్బతిన్నాయని, వారికి ఇళ్లు మంజూరు అవుతాయని వెల్లడించారు.
పంట నష్టపోయిన రైతులకు తగిన పరిహారం చెల్లిస్తామని, పొలంలో ఇసుక మేటలు తొలగించేందుకు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇసుక మేటల తొలగింపు కోసం హెక్టారుకు రూ.12 వేలు సాయం అందిస్తామని అన్నారు.
ఈ సందర్భంగా డ్వాక్రా మహిళల గోడును విన్నారు. వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయామని, డ్వాక్రా డబ్బులు చెల్లించలేమని వరద బాధిత మహిళలు నిస్సహాయత వ్యక్తం చేశారు. దాంతో, సీఎం జగన్ స్పందిస్తూ, రుణ చెల్లింపులపై ఏడాదిపాటు మారటోరియం విధిస్తామని భరోసా ఇచ్చారు.