ఆండ్రాయిడ్ లో మరింత ఆకట్టుకునే ఫీచర్లు తీసుకువస్తున్న గూగుల్
- ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ కు సన్నాహాలు
- డిజిటల్ కార్ కీ ఫీచర్ కు తుదిమెరుగులు
- ఫోన్ ద్వారానే కారును స్టార్ట్ చేసే సదుపాయం
- సరికొత్తగా ఫ్యామిలీ బెల్ ఫీచర్
టెక్ దిగ్గజం గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను మరింత ఆధునికీకరిస్తోంది. సరికొత్త ఫీచర్లతో అప్ డేట్ చేస్తోంది. వాటిలో ముఖ్యమైనది డిజిటల్ కార్ కీ. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే మీ ఫోన్ ద్వారానే మీ కారు తాళం తీయొచ్చు. ప్రస్తుతం ఇది అభివృద్ధి దశలో ఉంది. కారు డోర్ తీయడం, డోర్ లాక్ చేయడమే కాదు, కంపాటిబులిటీ ఉన్న కారును మీ ఫోన్ ద్వారా స్టార్ట్ కూడా చేయొచ్చు. అందుకు ఆండ్రాయిడ్ లోని డిజిటల్ కార్ కీ సాయపడుతుంది.
అంతేకాదు, కారులో ఉన్న వివిధ రకాల సిస్టమ్స్ కు మరింత సులువుగా కనెక్ట్ అయ్యేలా ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్ ను కూడా గూగుల్ నవీకరిస్తోంది. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఫోన్ ద్వారా మాన్యువల్ గా కార్ సిస్టమ్స్ కు కనెక్ట్ కాలేకపోతుంటారు. అలాంటి సమయాల్లో ఆండ్రాయిడ్ ఆటో ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కారులోని వివిధ ఎలక్ట్రానిక్, డిజిటల్ వ్యవస్థలను ఇది ఆటోమేటిగ్గా అనుసంధానిస్తుంది.
తాజాగా వస్తున్న మరో ఫీచర్... ఫ్యామిలీ బెల్. దీని ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లు కలిగి ఉన్న ఓ కుటుంబంలో అందరికీ అలర్ట్స్ వెళుతుంటాయి. దీని ద్వారా కుటుంబ సభ్యుల రోజువారీ పనులకు సంబంధించిన కార్యాచరణను ఫోన్లు, హోమ్ స్పీకర్, స్మార్ట్ డిస్ ప్లే వంటి పరికరాల ద్వారా తెలుసుకోవచ్చు. సరిగ్గా చెప్పాలంటే మీరేం చేస్తున్నారో మీ కుటుంబ సభ్యులందరూ తెలుసుకోగలుగుతారు. ఉదయం పూట కుటుంబ సభ్యులందరితో కలిసి అల్పాహారం తీసుకోవాలనుకుంటే ఆ సమయానికి అందరి ఫోన్లకు సందేశాలు వెళతాయి.
ఇక గూగుల్ ఫొటోస్ ను కూడా అప్ డేట్ చేస్తున్నారు. దీని ద్వారా మనకిష్టమైన వారి ఫొటోలను ఓ ఫ్రేమ్ లా రూపొందించుకోవచ్చు. మనకు నచ్చిన వారి ఫొటోలను అందులో చేర్చుకోవచ్చు. గతంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, పెంపుడు జంతువులతో తీసుకున్న ఫొటోలను మెమరీస్ పేరిట మళ్లీ మన ముందుకు తీసుకువస్తుంది. . ఇవేకాకుండా యూజర్లను ఆకట్టుకునే పలు ఫీచర్లతో త్వరలోనే ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ తీసుకువచ్చేందుకు గూగుల్ సన్నాహాలు చేస్తోంది.