పార్లమెంట్‌లో గందరగోళం.. కేంద్ర సర్కారు తీరుపై విపక్షాల మండిపాటు
- లోక్‌సభ, రాజ్యసభలో విపక్ష పార్టీల సభ్యులు ఆందోళన
- ధాన్యాల కొనుగోలు విధానాన్ని ప్రకటించాలని టీఆర్ఎస్ డిమాండ్
- రాజ్యసభలో 12 మంది ఎంపీల సస్పెన్షన్ పై నిరసన
పార్లమెంట్‌లో నాలుగో రోజూ గందరగోళం నెలకొంది. లోక్‌సభ, రాజ్యసభలో విపక్ష పార్టీల సభ్యులు ఆందోళనకు దిగారు. ధాన్యాల కొనుగోలు విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. పోడియం చుట్టూ ప్లకార్డులు పట్టుకుని కేంద్ర సర్కారు తీరుపై మండిపడుతూ నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైతులకు కనీస మద్దతు ధర కోసం నినాదాలు చేశారు.
మరోవైపు, రాజ్యసభలో 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ ను ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ప్రదర్శన చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.