థియేటర్లో 'జై బాలయ్య' నినాదాలతో హోరెత్తించిన ఫ్యాన్స్.. వీడియో ఇదిగో
- అఖండ సినిమా విడుదల సందర్భంగా ఫ్యాన్స్ హంగామా
- కర్నూలులో థియేటర్ల ముందు ఆటోలు తిప్పిన వైనం
- జై బాలయ్య నినాదాలతో మార్మోగిపోతోన్న థియేటర్లు
నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, జగపతి బాబు, శ్రీకాంత్ వంటి నటులతో దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందించిన అఖండ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలలాగే అఖండ అద్భుతంగా ఉందని, హ్యాట్రిక్ విజయాన్ని సాధించారని అభిమానులు ఖుషీ అవుతున్నారు.
థియేటర్ల వద్ద వారు చేస్తోన్న హంగామా అంతా ఇంతా కాదు. ప్రసాద్ ఐమ్యాక్స్ లో సినిమా విశ్రాంతి సమయంలో అభిమానులు జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు, కర్నూలులోని ఓ థియేటర్ వద్ద కాగితాలు ఎగరేస్తూ రెండు ఆటోల్లో తిరుగుతూ కొందరు ఫ్యాన్స్ నానా హంగామా చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో అఖండ సినిమా విడుదలైన థియేటర్లలో బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. బాలకృష్ణతో సినిమా తీయడంతో చాలా కాలం తర్వాత బోయపాటి శ్రీనుకి మంచి హిట్ వచ్చిందని అభిమానులు అంటున్నారు. కొన్ని థియేటర్ల వద్ద బాలయ్య కటౌట్లకు హారతులు ఇచ్చారు.
కాగా, ఈ సినిమాలో పూర్ణ, సుబ్బరాజు, అవినాశ్, సాయికుమార్, శ్రవణ్, తదితరులు నటించారు. ఈ సినిమాతో శ్రీకాంత్ తన నటనలోని కొత్త కోణాన్ని ప్రదర్శించాడని ఆయనకు కూడా మంచి మార్కులు పడుతున్నాయి. ఈ సినిమాకు సంగీతం తమన్ అందించారు. మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమాకు నిర్మాత.