తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చంటూ హైకోర్టు ఉత్తర్వులు

  • ధరలు పెంచుకునేందుకు అనుమతి కోరిన థియేటర్లు
  • స్పందించిన తెలంగాణ సర్కారు
  • హైకోర్టును ఆశ్రయించిన థియేటర్ల యాజమాన్యాలు
  • పిటిషన్లపై విచారణ
రానున్నది సంక్రాంతి సీజన్ కావడంతో పెద్ద సినిమాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. అయితే, థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు క్షేమంగా ఉండాలంటే తొలి వారం కలెక్షన్లు ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో టికెట్ల ధరలు పెంచుకునేలా అనుమతి ఇవ్వాలంటూ మల్టీప్లెక్స్ లు, థియేటర్ల యాజమాన్యాలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాయి.

వాస్తవానికి మల్టీప్లెక్స్ లు, థియేటర్ల యాజమాన్యాలు ఈ అంశంలో మొదట ప్రభుత్వానికే విజ్ఞప్తి చేశాయి. ఒక్కో టికెట్టుపై కనీసం రూ.50 పెంచేలా అనుమతి ఇవ్వాలని విన్నవించాయి. ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో థియేటర్ల యాజమాన్యాలు కోర్టులో పిటిషన్లు వేశాయి.

విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు టికెట్ల ధరలు పెంచుకోవచ్చని తాజాగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులు తుది నిర్ణయం తీసుకునేవరకు థియేటర్ల యాజమాన్యాలు తాము కోరుకున్న ధరలకు టికెట్లు విక్రయించుకునేలా అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది.


More Telugu News