ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఇదేనట!
- ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ తాజా నివేదిక
- అత్యంత ఖరీదైన నగరంగా టెల్ అవీవ్
- ఇజ్రాయెల్ లో ద్రవ్యోల్బణం
- టెల్ అవీవ్ లో విపరీతంగా పెరిగిపోయిన జీవన వ్యయం
గతంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం అంటే టోక్యో, లండన్, న్యూయార్క్ వంటి నగరాల గురించి చెప్పుకునేవారు. ఆశ్చర్యకరంగా ఓ కొత్త నగరం తాజాగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా నిలుస్తోంది. ఆ నగరం... టెల్ అవీవ్. ఇజ్రాయెల్ లో అంతకంతకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం టెల్ అవీవ్ లో జీవన స్థితిగతులను అత్యంత ఖరీదైన వ్యవహారంగా మార్చివేసింది.
తాజాగా ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితాను రూపొందించింది. టెల్ అవీవ్ గతంతో పోల్చితే ఐదు స్థానాలు ఎగబాకి ప్రథమస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఖరీదైన నగరాలుగా పారిస్, సింగపూర్ సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచాయి. ఆ తర్వాత స్థానాల్లో జ్యూరిచ్, హాంకాంగ్ నగరాలు ఉన్నాయి.
మొత్తం 173 నగరాల్లో ధరలు, ఇతర సేవలను పరిగణనలోకి తీసుకుని ఈఐయూ ఈ జాబితా రూపొందించింది. అమెరికా డాలర్ ను ప్రామాణికంగా తీసుకుని అధ్యయనం చేపట్టారు. గత ఏడాది ఈ జాబితాలో పారిస్, జ్యూరిచ్, హాంకాంగ్ నగరాలు అగ్రస్థానాన్ని పంచుకున్నాయి.