తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిసిన నీతి ఆయోగ్ బృందం
- ఏపీ పర్యటనకు విచ్చేసిన నీతి ఆయోగ్ బృందం
- వైఎస్ చైర్మన్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో సీఎం జగన్ తో భేటీ
- నీతి ఆయోగ్ కు పలు అంశాలు నివేదించిన ఏపీ అధికారులు
- విభజన హామీలు నెరవేర్చాలని వినతి
నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ బృందం ఏపీలో పర్యటిస్తోంది. నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న నవరత్నాలపై అధికారులు నీతి ఆయోగ్ బృందానికి వివరించారు. రాష్ట్ర విభజన వల్ల ఎదురైన సమస్యలు, ఇబ్బందులను నివేదించారు. ఏపీకి ప్రత్యేక హోదా, పారిశ్రామిక రాయితీలు, పన్ను మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
బొలంగీర్, బుందేల్ ఖండ్, కోరాపుట్ తరహాలో ఏపీని ఆదుకోవాలని, విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలని కోరారు. అటు, విద్యుత్ రంగ సమస్యలను సైతం అధికారులు నీతి ఆయోగ్ బృందంతో భేటీ సందర్భంగా ప్రస్తావించారు. కాగా, నీతి ఆయోగ్ బృందం రెండ్రోజుల పాటు ఏపీలో పలు కార్యక్రమాల్లో పాల్గొననుంది.